Breaking News

రోహిత్‌పైనే దృష్టి

Published on Sat, 06/13/2026 - 03:37

ధర్మశాల: వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చే ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో జరగనుండగా... దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది. మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసేందుకు, అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్‌కు ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ఓపెనర్, మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే అందరి దృష్టీ నిలిచింది. భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. 

ఇటీవల ఐపీఎల్‌లో ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొని కోలుకున్న రోహిత్‌ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గాయంతో ఇప్పటికే విరాట్‌ కోహ్లి సిరీస్‌ నుంచి తప్పుకోవడంతో రోహిత్‌ ఆట కీలకం కానుంది. 39 ఏళ్ల రోహిత్‌ అటు బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సి  ఉంటుంది.  భారత్‌ తమ ఆఖరి వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడగా, రోహిత్‌ అన్ని మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. 

సత్తా చాటేందుకు నితీశ్‌ సిద్ధం... 
కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు రోహిత్‌ ఓపెనింగ్‌ చేయనుండగా... కోహ్లికి బదులుగా ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో దిగవచ్చు. ఆ తర్వాత శ్రేయస్, రాహుల్‌ స్థానాలు పదిలం కాగా, ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, సుందర్‌ ఉంటారు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్‌ ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ప్రసిధ్, అర్ష్ దీప్‌లతో పాటు మూడో స్థానం కోసం కొత్త ఆటగాడు గుర్నూర్‌ సింగ్, ప్రిన్స్‌ యాదవ్‌ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. 

ఆరో స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్, ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి తన చోటును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన నితీశ్‌ తన గత వన్డేలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బౌలింగ్‌లో కూడా పేస్‌ పదును పెంచుకున్న అతను టి20లను దాటి ఈ ఫార్మాట్‌లో 10 ఓవర్లు ఎలా వేస్తాడనేది ఆసక్తికరం. హార్దిక్‌ పాండ్యా పదే పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో నితీశ్‌కు ఇది చాలా చక్కటి అవకాశం. 

3–0తో ఆధిక్యం... 
మరోవైపు అఫ్గానిస్తాన్‌ జట్టు అనుభజ్ఞులైన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇబ్రహీమ్, గుర్బాజ్, రహ్మత్‌ షా, హష్మతుల్లా ప్రధాన బ్యాటర్లు కాగా... ఆల్‌రౌండర్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్‌ గత రెండేళ్లలో చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు ఆడని రషీద్‌ ఖాన్‌ రాకతో స్పిన్‌ బలంగా మారగా, ఘజన్‌ఫర్‌ కూడా కీలకం కానున్నాడు. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌. గతంలో ప్రపంచకప్, ఆసియా కప్‌లలో కలిపి రెండు టీమ్‌లు 4 మ్యాచ్‌లలో తలపడగా... భారత్‌ 3 గెలిచింది. మరో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)