Breaking News

‘స్వర్ణ’ సురుచి

Published on Sat, 06/14/2025 - 03:45

మ్యూనిక్‌: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) మూడో ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టుకు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 19 ఏళ్ల సురుచి సింగ్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో సురుచి పోటీపడ్డ మూడు ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ బంగారు పతకాలు గెలవడం విశేషం. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 241.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించింది. 

కామిలీ జెద్రెజెవ్‌స్కీ (ఫ్రాన్స్‌; 241.7 పాయింట్లు) రజతం నెగ్గగా... కియాన్‌జున్‌ యావో (చైనా; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించింది. ఈ ఏడాది జాతీయ సీనియర్‌ జట్టులోకి వచ్చిన సురుచి ఏప్రిల్‌లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన తొలి ప్రపంచకప్‌ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం సాధించింది. ఏప్రిల్‌లోనే పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్‌ టోర్నీలో సురుచి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు గెలిచింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)