క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి

Published on Sat, 06/20/2026 - 04:07

చెన్నై: సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌ను ఏకైక టెస్టులో చిత్తుగా ఓడించిన భారత జట్టు ఆపై వరుసగా రెండు వన్డేల్లో కూడా ప్రత్యర్థిపై చెలరేగింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్‌ మరో మ్యాచ్‌నూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్‌తో చివరిదైన మూడో వన్డేకు నేడు చెపాక్‌ మైదానం సిద్ధమైంది. సగం ఓవర్లే సాగిన తొలి మ్యాచ్‌లో, పూర్తి మ్యాచ్‌ జరిగిన గత మ్యాచ్‌లో కూడా టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కొనసాగింది. గత మ్యాచ్‌లో గిల్, ఇషాన్‌ల శతకాలతో జట్టు 400కు పైగా స్కోరు నమోదు చేసింది. 

రాహుల్, శ్రేయస్‌ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాల్సి ఉంది. రెండో వన్డేలో విఫలమైనా... జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. లక్నో వన్డేలో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక్కడ కూడా అతను తన జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఈ సిరీస్‌తో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాళ్లు గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ దూబే తమకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నారు. 

అర్ష్ దీప్‌ ఫర్వాలేదనిపించగా, కుల్దీప్‌ మాత్రం గత వన్డేలో ప్రభావం చూపలేదు. గాయంతో రెండో వన్డేకు దూరమైన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయమైంది. మరో వైపు అఫ్గానిస్తాన్‌ పరిస్థితి మాత్రం పేలవంగా కనిపిస్తోంది. గుర్బాజ్‌ రెండు మ్యాచ్‌లలో చెలరేగినా జట్టుకు కావాల్సిన ఫలితం దక్కకపోగా, టాప్‌ స్పిన్నర్‌ రషీద్‌ కూడా భారత్‌ను నిలువరించలేకపోయాడు.  చెన్నై పిచ్‌పై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమాన అవకాశాలు ఉన్నాయి.   

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)