ఆఖరి వన్డే గెలుస్తారా!

Published on Sun, 03/01/2026 - 03:51

హోబర్ట్‌: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్‌ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకునేందుకు, గెలుపు తృప్తితో ముగించేందుకు ఆఖరి వన్డే బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన జోరు మీదున్న ఆసీస్‌ను సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే సిరీస్‌కు వచ్చేసరికి భారత బ్యాటింగ్‌ తడబడుతోంది. 

టాపార్డర్‌లో స్మృతి మంధాన, మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ మెరుగ్గా ఆడుతున్నప్పటికీ సహచరులంతా ఆసీస్‌ బౌలింగ్‌కు దాసోహం కావడం జట్టుకు ప్రతికూలంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మలు రాణించాలి. అలాగే బౌలింగ్‌ విభాగం కూడా మెరుగవ్వాలి. రేణుక, క్రాంతి, కాశ్వీ గౌతమ్‌లు ఆరంభంలో వికెట్లు తీయగలిగితే పటిష్టమైన ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్‌ను సంతృప్తికరంగా ముగిస్తుంది. లేదంటే వైట్‌వాష్‌ ఖాయమవుతుంది. 

గత రెండు మ్యాచ్‌ల్లోనూ కంగారూ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఇప్పుడు ఇదే జోరుతో ‘హ్యాట్రిక్‌’ విజయంపై కన్నేసింది. ఇదే జరిగితే ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ (టి20, వన్డే, ఏకైక టెస్టు సిరీస్‌)లోనూ ఆ్రస్టేలియా పైచేయి సాధిస్తుంది. ఒకే ఒక టెస్టును డ్రా చేసుకున్నా... ఆసీసే ఓవరాల్‌ చాంప్‌గా నిలుస్తుంది. ఉ. గం. 9:20 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్‌’లో ప్రసారం

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)