Breaking News

భారత మహిళల జట్టు శుభారంభం

Published on Fri, 10/18/2024 - 03:56

కట్మాండు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్‌ భారీ విజయంతో శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా గురువారం ఇక్కడి దశరథ్‌ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5–2 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. సగం మ్యాచ్‌ ముగిసేసరికే దాయాది జట్టుపై 4–1తో పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచింది. 

తద్వారా కెప్టెన్‌ ఆశాలతా దేవి అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. ఐదో నిమిషంలోనే భారత్‌ ఖాతా తెరిచింది. భారత్‌ తరఫున గ్రేస్‌ డాంగ్మెయి (5వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... మనీషా (17వ ని.లో), బాలాదేవి (35వ ని.లో), జ్యోతి చౌహాన్‌ (78వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. 

ఈ మ్యాచ్‌ ద్వారా బాలాదేవి 50 గోల్స్‌ మైలురాయిని అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా ఆమె గుర్తింపు పొందింది. పాక్‌ తరఫున సుహ హిరాణి (45+2వ ని.లో), మేరీ సిద్దిఖీ (47వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.  

 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు