‘టెస్టులో అన్నీ బాగా కుదిరాయి’

Published on Wed, 07/15/2026 - 02:56

లండన్‌: టి20 వరల్డ్‌ కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌పై ఏకైక టెస్టులో ఘన విజయంతో సత్తా చాటింది. హర్మన్‌ప్రీత్‌ బృందానికి ఈ గెలుపు ఊరటనిచ్చింది. ఈ టెస్టులో మన జట్టుకు అన్ని అంశాలు కలిసొచ్చాయని జట్టు చీఫ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ అభిప్రాయపడ్డాడు. దూకుడు, ఓపిక కలగలిసిన ప్రదర్శనతో ఫలితం రాబట్టామని అతను అన్నాడు. ‘అందరూ చెబుతున్నట్లుగా ఈ టెస్టు మ్యాచ్‌లో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ఏదో ఒక్క అంశం గురించే ప్రత్యేకంగా చెప్పడం లేదు. ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెడుతూ అన్ని విధాలా క్రమశిక్షణను ప్రదర్శించాం. 

బ్యాటింగ్, బౌలింగ్‌ బాగా చేయడమే కాదు ఫీల్డింగ్‌లో కూడా ఎంతో మెరుగయ్యాం. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయడం సానుకూల ఫలితం ఇచ్చింది. దూకుడుతో పాటు కాస్త ఓపికను కూడా చూపించాం. ఇవే విజయానికి కారణంగా నిలిచాయి. మాకు మొత్తంగా చాలా మంచి మ్యాచ్‌గా మిగిలిపోయింది’ అని మజుందార్‌ విశ్లేషించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తిక భాటియా, క్రాంతి గౌడ్‌లపై కోచ్‌ ప్రశంసలు కురిపించాడు. క్రాంతి తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చగా, యస్తిక సెంచరీతో చెలరేగింది. 

‘యస్తిక ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకమైంది. అదీ లార్డ్స్‌ మైదానంలో రావడం దానిని చిరస్మరణీయంగా మార్చింది. గత రెండేళ్లుగా గాయాలతో బాధపడిన యస్తిక వాటి నుంచి కోలుకొని, ఎన్నో ప్రతికూలతలను అధిగమించి  ఇప్పుడు ఇలాంటి బ్యాటింగ్‌ చేయడం నిజంగా అభినందించదగ్గ అంశం. ముఖ్యంగా ఆమె ఆడిన చక్కటి షాట్లు చూసేవారికి కనువిందు చేశాయి. క్రాంతి బంతిపై నియంత్రణ చూపిన తీరు అద్భుతం. సరైన చోట ఆమె తాను అనుకున్నట్లుగా బంతులు వేయగలిగింది. గుడ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌తో వికెట్లు రాబట్టింది’ అని మజుందార్‌ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌ విషయంలో భారత జట్టు మొదటినుంచీ పటిష్టంగానే ఉందన్న కోచ్‌...యస్తిక కీపింగ్‌ ప్రదర్శనను కూడా కొనియాడాడు. 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)