Breaking News

భారత్‌కు పదో స్థానం

Published on Sat, 12/13/2025 - 03:25

సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు పదో స్థానంతో ముగించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జ్యోతి సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు 1–2 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ చేతిలో పరాజయం పాలైంది. భారత్‌ తరఫున కనిక సివాచ్‌ (41వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించగా... స్పెయిన్‌ తరఫున నటాలియా విలనోవా (16వ నిమిషంలో), ఎస్తెర్‌ కనాలెస్‌ (36వ నిమిషంలో) చెరో గోల్‌ కొట్టారు. 

మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా... ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే నటాలియా గోల్‌ చేయడంతో స్పెయిన్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు నుంచి కొన్ని చక్కటి ప్రయత్నాలు కనిపించినా... ఫినిషింగ్‌ లోపం కారణంగా అవి గోల్స్‌గా మారలేకపోయాయి. 

మూడో క్వార్టర్‌లో సోనమ్‌ చక్కటి గోల్‌ సాధించినా... స్పెయిన్‌ వీడియో రిఫరల్‌ ద్వారా ఆ గోల్‌ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే స్పెయిన్‌ మరో గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా... కాసేపటికి కనిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌ ఖాతా తెరిచింది. ఇక ఆఖరి క్వార్టర్‌లో స్పెయిన్‌ ఆధిక్యాన్ని కాపాడుకోగా... భారత జట్టు మరో గోల్‌ సాధించలేక ఓటమి వైపు నిలిచింది.   

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌