ఎఫ్‌ఐఎం ఇ–ఎక్స్‌ప్లోరర్‌లో భారత జట్టు

Published on Fri, 01/19/2024 - 02:35

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మోటార్‌ సైక్లింగ్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఎం) నిర్వహించే ప్రతిష్టాత్మక ఇ–ఎక్స్‌ప్లోరర్‌ ఈవెంట్‌లో తొలిసారి భారత జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. 2024 సీజన్‌లో భారత్‌కు చెందిన ‘ఇండి రేసింగ్‌’ టీమ్‌ బరిలోకి దిగుతుంది. అధికారికంగా ఎఫ్‌ఐఎం అనుమతించిన రేసింగ్‌ పోటీల్లో పాల్గొనే తొలి టీమ్‌ ‘ఇండి రేసింగ్‌’ అవుతుంది. ఈ జట్టు యజమాని కంకణాల అభిశేక్‌ రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. తాజా సీజన్‌ రేస్‌లు జపాన్‌లో వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతాయి.

నవంబర్‌లో హైదరాబాద్‌లోనే రేసింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఇండి రేసింగ్‌ టీమ్‌ తరఫున ఐశ్వర్య పిస్సే, స్పెన్సర్‌ విల్టన్, సాండ్రా గోమెజ్‌ పోటీ పడతారు. భారత్‌లో మోటార్‌ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఇటీవల చాలా పెరిగిందని, అయితే పోటీల్లోకి వచ్చేసరికి మన టీమ్‌కు ప్రాతినిధ్యం లేదని కంకణాల స్పోర్ట్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు అభిశేక్‌ రెడ్డి అన్నారు. ఇప్పుడు తమ జట్టు ఇండి రేసింగ్‌ ఆ అవకాశం కలి్పస్తుందని, ఎక్కువ మంది దీనివైపు మళ్లేలా తమ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)