Breaking News

సిరీస్‌ కాపాడుకునేందుకు...

Published on Thu, 10/23/2025 - 05:27

అడిలైడ్‌: శుబ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో తొలి వన్డే ఓడిన భారత జట్టు మరో పోరులో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో ఆ్రస్టేలియాతో భారత్‌ తలపడుతుంది. ప్రస్తుతం 0–1తో వెనుకంజతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను చేజార్చుకుంటుంది. వర్షం కారణంగా 26 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది. 

ఆ్రస్టేలియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. సహజంగానే మరోసారి అందరి దృష్టీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలపైనే ఉంది. తొలి వన్డేలో వీరిద్దరు విఫలం కావడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతీ మ్యాచ్‌ వీరికి పరీక్ష కాదని చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ చెబుతున్నా... కచి్చతంగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపై ఉందనేది వాస్తవం. అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి తన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. 

భారత్‌ తుది జట్టు విషయంలో మార్పు ఉండకపోవచ్చు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లలో ఒకరిని తప్పించి రెగ్యులర్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌కు అవకాశం ఇస్తారా అనేది సందేహమే. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌లో ఫిలిప్స్, కునెమన్‌ స్థానాల్లో అలెక్స్‌ కేరీ, ఆడమ్‌ జంపా రావడం ఖాయమైంది. అడిలైడ్‌ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో (2012, 2019) భారత జట్టే గెలిచింది.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)