Breaking News

రోహిత్‌ వెనకాలే కోహ్లి

Published on Thu, 12/11/2025 - 04:00

దుబాయ్‌: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేసిరీస్‌లో దంచికొట్టిన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌సెంచరీతో 302 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లి... తాజా ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరాడు. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

ఈ ఇద్దరి మధ్య 8 పాయింట్ల అంతరమే ఉంది. గాయం కారణంగా సఫారీలతో సిరీస్‌కు దూరమైన శుబ్‌మన్‌ గిల్‌ (723 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో ఉండగా... కేఎల్‌ రాహుల్‌ (649 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 12వ ర్యాంక్‌లో నిలిచాడు. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ (655 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 

అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (710 పాయింట్లు) ‘టాప్‌’లో కొనసాగుతున్నాడు. టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మ (913 పాయింట్లు), బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి (782 పాయింట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా (879 పాయింట్లు) ‘టాప్‌’లో ఉండగా... యాషెస్‌ సిరీస్‌లో విజృంభిస్తున్న మిచెల్‌ స్టార్క్‌ (852 పాయింట్లు) మూడో స్థానాలు మెరుగు పరుచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)