అమన్, అంతిమ్‌పై నజర్‌ 

Published on Fri, 01/02/2026 - 04:25

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్లు అమన్‌ సెహ్రావత్, అంతిమ్‌ పంఘల్‌... ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌) వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమన్‌ పురుషుల విభాగంలో రూ. 18 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానుండగా... మహిళల విభాగంలో అంతిమ్‌ రూ. 10 లక్షలు ‘బేస్‌ ప్రైస్‌’గా నిర్ణయించుకుంది. ఈ నెల 15 నుంచి ఈ లీగ్‌ ప్రారంభం కానుండగా... శనివారం వేలం నిర్వహించనున్నారు. 

ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు హరియాణ థండర్స్, టైగర్స్‌ ఆఫ్‌ ముంబై దంగల్స్, పంజాబ్‌ రాయల్స్, మహారాష్ట్ర కేసరి, ఢిల్లీ దంగల్‌ వారియర్స్, యూపీ డామినేటర్స్‌ పాల్గొంటున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ అత్యధిక ప్రాథమిక ధరతో వేలంలో అందుబాటులో ఉండగా... కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత దీపక్‌ పూనియా, నవీన్‌ రూ. 10 లక్షల ‘బేస్‌ ప్రైస్‌’తో వేలంలోకి రానున్నారు. 

అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సుజీత్‌ కల్‌కల్‌ తన ప్రాథమిక ధరను రూ. 7 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. విదేశీ రెజ్లర్ల కేటగిరీల్లో రష్యాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్‌ మగోమ్‌డోవ్‌తో పాటు అర్మాన్‌ (అర్మెనియా), ఇస్మాయిల్‌ (హంగేరీ), అర్సెన్‌ (అర్మేనియా), ఉస్మానోవ్‌ అహ్మద్‌ (రష్యా) రూ. 10 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానున్నారు. మహిళల విభాగంలో భారత స్టార్‌ అంతిమ్‌ పంఘల్‌ రూ. 10 లక్షల ‘బేస్‌ ప్రైస్‌’తో వేలంలోకి రానుంది.
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)