గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...

Published on Mon, 01/12/2026 - 07:30

వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్‌’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్‌ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్,  ‘కింగ్‌’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది. 

రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్‌లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్‌లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్‌ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్‌ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు పాల్గొన్నారు.     

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)