Breaking News

ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్‌

Published on Fri, 08/28/2026 - 13:02

కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.  ఓటమి ఖాయమనుకున్న చోట శ్రీలంక యువ బ్యాటర్‌ సోనల్‌ దినూషా అద్భుతం చేశాడు. దాదాపు 100 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తన విరోచిత పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ నేపథ్యంలో సోనల్‌  దినూషాపై భారత దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"కొలంబో టెస్టులో నిజానికి భారత్‌ గెలవాల్సింది. పరీక్షల్లో 'అవుట్ ఆఫ్ సిలబస్' ప్రశ్నలా..  దినూషా భారత జట్టుకు కొరకరాని కొయ్యగా మారాడు.  'ఎవరీ కొత్త ఆటగాడు?' అని అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. డ్రా అయినప్పటికి ఇది శ్రీలంకకు ఒక విజయం లాంటిదే. 

నాలుగు రోజులకే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి రోజు చివరి సెషన్‌ వరకు తీసుకొచ్చారు. వారికి ప్రస్తుతం కేవలం ఇద్దరు మంచి స్పిన్నర్ల అవసరముంది. ఈ సమస్య తీరితే శ్రీలంక తమ పూర్వవైభవాన్ని తిరిగి పొందే అవకాశముంది" అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

అదేవిధంగా సోనల్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను కూడా అశ్విన్‌ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో దినూషా ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లు చూశాను. కఠినమైన పిచ్‌లపై కూడా అతడు అద్భుతంగా ఆడాడు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. పడిక్కల్‌ కంటే బాగా ఆడాడు. పడిక్కల్‌ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌పై షాట్లు ఆడతాడు. 

కానీ అతడు మరీ ఎక్కువగా వెనక్కి వెళ్లడం వల్ల బౌల్డ్‌ అయ్యాడు. కానీ ఈ లంక కుర్రాడు ఒక్క బంతికి కూడా ఇబ్బంది పడలేదు. బంతి లెంగ్త్‌ను ముందే అంచనా వేస్తున్నాడు. భారత స్పిన్నర్లను అతడు ఆడిన స్వీప్‌ షాట్లు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అని ఈ సీఎస్‌కే లెజెండరీ స్పిన్నర్‌ కొనియాడాడు.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)