Breaking News

పురోగతి కోసం ప్రక్షాళన!

Published on Sat, 09/14/2024 - 12:29

న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్‌ భైచుంగ్‌ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మన టీమ్‌ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్‌ఎఫ్‌ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్‌ కప్‌లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్‌తో కూడా మ్యాచ్‌ గెలవలేకపోయామని భూటియా అన్నాడు.

 ‘భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్‌లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్‌కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్‌ఎఫ్‌ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు.

 ఏదో విజన్‌ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్‌ఎఫ్‌లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్‌బాల్‌కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్‌బాల్‌ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)