Breaking News

‘యునైటెడ్‌ ఇన్‌ మాంచెస్టర్‌’

Published on Mon, 07/21/2025 - 04:19

మాంచెస్టర్‌: భారత క్రికెట్‌ జట్టు ఒకవైపు నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతూనే మరోవైపు విరామ సమయాన్ని సరదాగా గడుపుతోంది. తాజాగా విఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ ‘మాంచెస్టర్‌ యునైటెడ్‌’ ప్రాక్టీస్‌ గ్రౌండ్‌ను టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు. ఇరు జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న స్పోర్ట్స్‌వేర్‌ ‘అడిడాస్‌’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్, ఫుట్‌బాల్‌ టీమ్‌ల సభ్యులు పరస్పర గౌరవాన్ని ప్రదర్శిస్తూ జెర్సీలు మార్చుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు మాంచెస్టర్‌ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ముందుగా ఫుట్‌బాల్‌ ఆడారు. 

ఆపై మాంచెస్టర్‌ ప్లేయర్లు క్రికెట్‌లో తమ ఆసక్తి ప్రదర్శిస్తూ బ్యాటింగ్‌ చేశారు. స్టార్‌ డిఫెండర్‌ హ్యారీ మేగ్వైర్‌కు సిరాజ్‌ బౌలింగ్‌ చేయగా... ‘రెడ్‌ డెవిల్స్‌’ టీమ్‌ సభ్యులు డియాలో, మేసన్‌ మౌంట్‌ తదితరులతో ఫుట్‌బాల్‌ ఆడేందుకు పంత్, బుమ్రా ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. మాంచెస్టర్‌ యునైటెడ్, పోర్చుగల్‌ జట్లకు కెపె్టన్‌ అయిన బ్రూనో ఫెర్నాండెజ్‌తో భారత కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కబుర్లాడాడు. 

మరోవైపు భారత్, మాంచెస్టర్‌ యునైటెడ్‌ హెడ్‌ కోచ్‌లు గంభీర్, రూబెన్‌ అమోరిమ్‌ మధ్య కూడా సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. శిక్షణ, నాయకత్వం, స్టార్‌ ఆటగాళ్లతో జట్లను నడిపించడంవంటి అంశాలపై చివర్లో ఇరు జట్ల కోచ్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించడంతో కార్యక్రమం ముగిసింది. బుధవారం నుంచి ఓల్ట్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)