Breaking News

రూ.4 కోట్ల 75 లక్షలు!

Published on Thu, 03/20/2025 - 03:43

ముంబై: భారత క్రికెట్‌ జట్టు లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌’గా చెబుతారు.

అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్‌ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్‌ వెల్లడించాడు. 

దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్‌ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.

ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్‌ ధనశ్రీ వర్మతో చహల్‌కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్‌ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు.   

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)