Breaking News

"టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌" క్యాప్స్‌ అందుకున్న టీమిండియా క్రికెటర్లు

Published on Thu, 05/30/2024 - 12:56

టీ20 వరల్డ్‌కప్‌ 2024కు ముందు పలువురు టీమిండియా క్రికెటర్లు "టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌" క్యాప్స్‌ అందుకున్నారు. గతేడాది జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌లను టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ క్యాప్స్‌తో పాటు ఐసీసీ అవార్డులు వరించాయి.

ప్రపంచ నంబర్ వన్‌ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు. ఎడమచేతి వాటం పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్ కూడా టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు అందుకున్నారు.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భారత ప్రస్తానం జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం జూన్‌ 9న భారత జట్టు దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌.. పాకిస్తాన్‌, కెనడా, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడనుంది.

టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్

ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)