Breaking News

‘మన ఫిట్‌నెస్‌ ఇంకా మెరుగవ్వాలి’ 

Published on Tue, 11/11/2025 - 05:42

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిట్‌నెస్‌ స్థాయి పరంగా చూస్తే భారత జట్టు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని, మన టీమ్‌ ఈ విషయంలో అత్యుత్తమ స్థాయిని అందుకోలేదని భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ‘టి20 ప్రపంచకప్‌లో ఇది చాలా కీలకంగా మారుతుంది. మనం చాలా చురుగ్గా ఉండాలి, ఇదే విషయాన్ని ఆటగాళ్లతో చర్చించాం కూడా. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లంతా నిజాయితీగా తమ అభిప్రాయాలు చెప్పారు. ఎంత ఫిట్‌గా మానసికంగా అంతే చురుగ్గా 
ఉంటాం. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ఇది కూడా అవసరం.

 వరల్డ్‌ కప్‌కు ముందు అలాంటి స్థాయిని అందుకునేందుకు మనకు ఇంకా మూడు నెలల సమయం ఉంది’ అని గంభీర్‌ అన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్‌ విజయం పట్ల కోచ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తాము కొన్ని కొత్త తరహాలో ప్రణాళికలు రచిస్తే, అవన్నీ సఫలమయ్యాయని గంభీర్‌ అన్నాడు. పవర్‌ప్లేలోనే బుమ్రాతో మూడు ఓవర్లు వేయించడం కూడా అలాంటిదేనని అతను చెప్పాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మూడు బుమ్రావే కావడం మంచి ప్రణాళిక. ఇది చాలా బాగా పని చేసింది. ఆరంభంలోనే మూడు మంచి ఓవర్లు పడితే ప్రత్యరి్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ స్పిన్నర్లు వస్తారు’ అని కోచ్‌ విశ్లేషించాడు. 

బౌలింగ్‌ విషయంలో మన జట్టుకు కనీసం 7–8 ప్రత్యామ్నాయాలు ఉంటే మంచిదన్నాడు. ‘దూబే, అక్షర్, సుందర్‌ లాంటి ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతంలో ఆరుకు మించి బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు ఉండకపోయేవి. ఇప్పుడు అంతకు మించి మనకు అవకాశం ఉంటోంది’ అని కోచ్‌ చెప్పాడు. మరో వైపు వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టు విజయాలే తనకు ముఖ్యమని కోచ్‌ పునరుద్ఘాటించాడు. ‘మ్యాచ్‌ ఓడాక మన జట్టులో బాగా ఆడిన వారిని ప్రశంసించడంలో అర్థమే లేదు. నేను వ్యక్తిగత రికార్డులకంటే టీమ్‌ గెలవడం గురించే ఆలోచిస్తాను. ఎవరైనా బాగా ఆడితే మంచిదే కానీ జట్టు గెలిస్తేనే నాకు సంతోషం. అందుకే వన్డే సిరీస్‌లో ఓటమి నిరాశకు గురి చేసింది’ అని గంభీర్‌ అన్నాడు. 
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)