Breaking News

టీమిండియా క్లీన్‌స్వీప్‌

Published on Tue, 12/30/2025 - 22:27

శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్‌ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్‌ జ్యోత్‌ కౌర్‌లు తలో వికెట్‌ తీసి విజయానికి సహకరించారు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.

మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)