చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Sat, 12/16/2023 - 12:38

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్‌ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్‌ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది.

1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో  పాకిస్తాన్‌ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్‌తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్‌ మూడు ,  గైక్వాడ్‌ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(21) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్‌ రెండు ఇన్నింగ్స్‌లు ‍కలిపి 9 వికెట్లు పడగొట్టంది.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)