షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్‌ ఘన విజయం

Published on Fri, 12/26/2025 - 21:36

తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్‌ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.

లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(21) రాణించింది. అయితే స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్‌(9) మాత్రం విఫలమయ్యారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 112 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భారత పేసర్‌ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి లంక టాపార్డ‌ర్‌ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఇమేషా దులాని 27 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫ‌ర్వాలేద‌న్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్‌ 28న జరగనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)