Breaking News

ఆర్య–రుద్రాంక్ష్ జోడీకి రజతం

Published on Thu, 04/10/2025 - 03:54

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ఏడో పతకం లభించింది. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఆర్య బోర్సే–రుద్రాంక్ష్  బాలాసాహెబ్‌ పాటిల్‌ జోడీ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్య–రుద్రాంక్ష్  ద్వయం 9–17 పాయింట్ల తేడాతో జిఫె వాంగ్‌–బుహాన్‌ సాంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 

కాంస్య పతక మ్యాచ్‌లో నర్మద నితిన్‌ రాజు–అర్జున్‌ బబూటా (భారత్‌) జంట 13–17 పాయింట్ల తేడాతో ఫెర్నాండా రుసో–మార్సెలో జూలియన్‌ గిటిరెజ్‌ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల ట్రాప్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు నిరాశపరిచారు. నీరూ 115 పాయింట్లతో 12వ స్థానంలో, ప్రగతి దూబే 110 పాయింట్లతో 17వ స్థానంలో, భవ్య త్రిపాఠి 106 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లోనూ భారత షూటర్లెవరూ ఫైనల్‌ చేరలేకపోయారు. 

జొరావర్‌ సింగ్‌ సంధూ 119 పాయింట్లతో ఏడో స్థానంలో, పృథ్వీరాజ్‌ 117 పాయింట్లతో 16వ స్థానంలో, లక్షయ్‌ 115 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచారు. టాప్‌–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం భారత్‌ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)