మన ఖాతాలో మరో ప్రపంచకప్‌

Published on Mon, 11/24/2025 - 02:20

కొలంబో: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత క్రికెట్‌ హవా నడుస్తోంది. విభాగం ఏదైనా... వేదిక ఎక్కడైనా... ప్రత్యర్థుల ఎవరైనా... అదరగొట్టే ఆటతీరుతో భారత జట్లు జయభేరి మోగిస్తున్నాయి. ఇటీవల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను తొలిసారి సొంతం చేసుకోగా... తొలిసారి నిర్వహించిన మహిళల అంధుల టి20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు జగజ్జేతగా అవతరించింది. 

ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జమున రాణి, అను కుమారి చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 12.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాంగి కరుణ కుమారి (27 బంతుల్లో 42) రాణించింది. ఫూలా సరేన్‌ (27 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు)తో కలిసి కరుణ కుమారి మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన 15 ఏళ్ల కరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో మొత్తం ఆరు (భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆ్రస్టేలియా, అమెరికా) దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది భారత పురుషుల జట్టు ఆసియా కప్‌ టి20 టోర్నీలో, చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీలో టైటిల్స్‌ సాధించగా... భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను దక్కించుకుంది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)