Breaking News

ఆర్య–అర్జున్‌ పసిడి గురి

Published on Sun, 06/15/2025 - 01:19

మ్యూనిక్‌: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) మూడో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సురుచి స్వర్ణ పతకం సాధించగా... శనివారం భారత్‌ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆర్య బోర్సే–అర్జున్‌ బబూతా జంట అద్వితీయమైన గురితో ఒలింపిక్‌ చాంపియన్‌ జిఫీ వాంగ్‌–లిహావో షెంగ్‌ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ఫైనల్లో ఆర్య–అర్జున్‌ జోడీ 17–7తో చైనా జంటను చిత్తుచేసి అగ్ర స్థానంలో నిలిచింది.

నార్వే జంటకు కాంస్య పతకం దక్కింది. భారత్‌కే చెందిన ఎలవెనిల్‌ వలరివన్‌–అంకుశ్‌ జాధవ్‌ జోడీ 631.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అర్జున్‌ 317.7 పాయింట్లు సాధించగా... ఆర్య 317.5 పాయింట్లు స్కోరు చేసింది. దీంతో ఓవరాల్‌గా 635.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్‌ టోర్నీ రుద్రాం„Š  పాటిల్‌తో కలిసి ఆర్య బోర్సే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో రజత పతకం గెలిచింది.

 తాజా ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం కాగా... ఓవరాల్‌గా నాలుగో పతకం. సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా, ఎలవెనిల్‌ వలరివన్‌ వ్యక్తిగత కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌–ఆదిత్య మల్రా 577 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సురుచి సింగ్‌–వరుణ్‌ తోమర్‌ జంట 576 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమైంది.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)