Breaking News

విజయమే లక్ష్యంగా...

Published on Sat, 07/27/2024 - 04:10

పారిస్‌: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత పురుషుల హాకీ జట్టు అదే జోరును ‘పారిస్‌’లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. నేడు జరిగే పూల్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా స్థాయికి తగ్గట్టు ఆడితే శుభారంభం చేస్తుంది. పూల్‌ ‘బి’లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం, ఆ్రస్టేలియా, అర్జెంటీనా, ఐర్లాండ్‌ జట్లున్నాయి. మరోవైపు పూల్‌ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌ జట్లున్నాయి. 

లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్‌–4లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ తర్వాత భారత జట్టు వరుసగా అర్జెంటీనా (29న), ఐర్లాండ్‌ (30న), బెల్జియం (ఆగస్టు 1న), ఆ్రస్టేలియా (ఆగస్టు 2న) జట్లతో ఆడుతుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెబుతానని ప్రకటించిన మేటి గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌కు వీడ్కోలు కానుకగా పతకం అందించాలని హర్మన్‌ప్రీత్‌ బృందం పట్టుదలతో ఉంది. 

అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 105 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 58 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందగా...30 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ నెగ్గింది. 17 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. శనివారమే జరిగే ఇతర గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనా... బెల్జియంతో ఐర్లాండ్‌ తలపడతాయి. గ్రూప్‌ ‘ఎ’లో బ్రిటన్‌తో స్పెయిన్‌; దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్‌; జర్మనీతో ఫ్రాన్స్‌ ఆడతాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)