Breaking News

సాయి సుద‌ర్శ‌న్.. సూప‌ర్‌ స్లో బ్యాటింగ్‌!

Published on Wed, 11/26/2025 - 12:39

ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (Sai Sudharsan) ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకునేందుకు చాలాసేపు క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల ప‌దునైన‌ బంతుల‌ను ఎదుర్కొనేందుకు బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. వికెట్ ప‌డ‌కుండా ఉండేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి విజ‌య‌వంతం కాలేక‌పోయాడు. ముత్తుసామి బౌలింగ్‌లో మార్క్‌ర‌మ్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా అవుట‌య్యాడు.

27/2 ఓవ‌ర్‌నైట్‌ స్కోరుతో చివ‌రి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు 31 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మ‌రో మూడు వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ యాద‌వ్ (5), ధ్రువ్ జురేల్‌(2), రిష‌బ్ పంత్‌(13) స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగాడు.

మ‌రో ఎండ్‌లో సాయి సుద‌ర్శ‌న్ మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. 2 ప‌రుగుల‌తో చివ‌రి రోజు ఆట మొద‌లు పెట్టిన ఈ ఎడంచేతి వాటం బ్యాట‌ర్ ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో సఫారీ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. ప‌రుగులు రాబ‌ట్ట‌క‌పోయినా వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌లో అత్య‌ధిక బంతులు ఎదుర్కొన్న‌ భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. 139 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో 14 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీన్ని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది సాయి ఎంత స్లోగా ఆడాడో. మ్యాచ్ ఎలాగూ ఓడిపోతాం కాబ‌ట్టి.. వికెట్లు ప‌డ‌కుండా ఉంటే డ్రా అవుతుంద‌న్న ఉద్దేశంతో అత‌డు ఇలా బ్యాటింగ్ చేశాడ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

టీమిండియా చిత్తు
మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టీమిండియా 408 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో 549 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ 140 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. అర్ధ సెంచ‌రీతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) 9వ‌ వికెట్‌గా వెనుదిరిగాడు. జ‌డేజా 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేసి కేశ‌వ మ‌హ‌రాజ్ బౌలింగ్‌లో అవుట‌య్యాడు.

చ‌ద‌వండి: ద‌క్షిణాఫ్రికా కోచ్‌పై మండిప‌డ్డ దిగ్గ‌జాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)