Breaking News

India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...

Published on Tue, 12/12/2023 - 00:52

పోర్ట్ట్‌ ఎలిజబెత్‌: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్‌ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది.

జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్‌ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు.  

టాస్‌ పడితే...
డర్బన్‌లో కనీసం టాస్‌ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్‌ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్‌ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు.

కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్‌కె, బర్గర్‌లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్‌రమ్‌ తన మార్క్‌ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్‌ రోజు వానపడినా... మ్యాచ్‌ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)