యూఏఈలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌..!

Published on Tue, 08/04/2026 - 14:32

మహిళల క్రికెట్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఆసియా కప్‌ 2026 టోర్నీకి సంబంధించిన తేదీలను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) సభ్య దేశాలకు అంతర్గతంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరిగే అవకాశం ఉంది.

ఈసారి టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే వేదికలు, పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను ACC ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

భారత్‌-పాక్‌ పోరు
టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, యూఏఈ జట్లు పాల్గొనే అవకాశం ఉంది.

దీంతో క్రికెట్‌ అభిమానులకు మరోసారి భారత్‌-పాకిస్థాన్‌ మహిళల మ్యాచ్‌ చూసే అవకాశం లభించనుంది. అయితే ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయనే విషయం పూర్తి షెడ్యూల్‌ విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.

సభ్య దేశాలకు పంపిన సమాచార ప్రకారం, జట్లు ఆగస్టు 27న యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ నిర్వహించేలా విండోను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్‌ ఎందుకు ఆలస్యం..?
టోర్నీ తేదీలను సభ్య దేశాలకు తెలియజేసినా, ACC నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. టోర్నీ వేదికకు సంబంధించిన తుది నిర్ణయం, పరిపాలనా అనుమతులు పూర్తికాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇదే కారణంగా భారత మహిళల ఆసియా కప్‌ జట్టు ప్రకటనను కూడా BCCI తొలుత ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

భారత్‌దే ఆధిపత్యం
2004లో ప్రారంభమైన మహిళల ఆసియా కప్‌ తొలుత వన్డే ఫార్మాట్‌లో జరిగింది. 2012 నుంచి టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతోంది.

భారత్‌ ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు టైటిళ్లు గెలిచింది. అయితే 2024లో జరిగిన చివరి ఎడిషన్‌లో శ్రీలంక ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్‌ సాధించింది.

 

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)