Breaking News

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నేడే..

Published on Fri, 07/19/2024 - 04:11

దంబుల్లా: మహిళల ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు టోర్నీ జరగ్గా... ప్రతీ సారి విజేతగా భారత్‌ నిలిచింది. టి20 ఫార్మాట్‌లో నాలుగుసార్లు టోర్నీ నిర్వహిస్తే ఒక్కసారి మినహా మూడు సార్లు భారతే చాంపియన్‌. ఒక్క 2018లో మాత్రమే ఫైనల్లో భారత్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ ట్రోఫీ అందుకుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత జట్టు మరోసారి ఫేవరెట్‌ ఆసియా కప్‌ టి20 టోర్నీలో బరిలోకి దిగుతోంది. 

నేటి నుంచి జరిగే ఈ పోరులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అసోసియేట్‌ టీమ్‌లు యూఏఈ, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్‌ దశ అనంతరం టాప్‌–2 టీమ్‌లు సెమీస్‌ చేరతాయి. ఈ నెల 28న ఫైనల్‌ నిర్వహిస్తారు. శుక్రవారం భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటోంది. 

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. టోర్నీలో భాగంగా ఈ నెల 21 యూఏఈతో, 23న నేపాల్‌తో భారత్‌ తలపడుతుంది. ఫామ్‌లో ఉన్న హర్మన్‌ బృందం ఇటీవల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించగా... అంతకుముందు బంగ్లాదేశ్‌ను 5–0తో చిత్తు చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)