Breaking News

ప్రపంచ కప్‌కు ముందు ఆఖరి పోరు

Published on Sat, 01/31/2026 - 04:01

తిరువనంతపురం: టి20 ప్రపంచ కప్‌కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్‌పై తొలి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు 3–0తో సిరీస్‌ను గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా...ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్‌లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది. 

ఈ నేపథ్యంలో నేడు గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన ఐదో టి20కి రంగం సిద్ధమైంది. మరోవైపు సిరీస్‌ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్‌లో రాణించిన క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకున్న కివీస్‌ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది. భారత్‌లోనే జరిగే వరల్డ్‌ కప్‌కు ముందు ఈ గెలుపు ఆ టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం.  

సిరీస్‌లో జట్టు ప్రదర్శనను బట్టి చూస్తే ఒక్క సంజు సామ్సన్‌ ఫామ్‌ విషయంలోనే మేనేజ్‌మెంట్‌ కొంత ఇబ్బంది పడుతోంది. తన సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య బరిలోకి దిగనున్న సామ్సన్‌ ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఇంతకంటే సరైన వేదిక, సమయం ఉండదు. తొలి టి20 ఆడుతూ గాయంతో తప్పుకున్న అక్షర్‌ పటేల్‌ తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆడతాడు. స్వల్ప గాయంతో వైజాగ్‌ మ్యాచ్‌ ఆడని ఇషాన్‌ కిషన్‌ కూడా ఫిట్‌గా ఉంటే మళ్లీ తుది జట్టులోకి రావచ్చు. 

మరోవైపు కివీస్‌ కూడా ఒక మార్పుతో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్, వికెట్‌ కీపర్‌ ఫిన్‌ అలెన్‌ అందుబాటులో రావడంతో సీఫెర్ట్‌ను విశ్రాంతినిచ్చి అతడిని ఆడించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడా మంచు ప్రభావం ఉంది. గతంలో ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్‌ 3 గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. చివరిసారిగా 2023 నవంబర్‌లో ఆ్రస్టేలియాతో జరిగిన పోరులో భారత్‌ 235 పరుగులు నమోదు చేసింది. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)