Breaking News

సిరీస్‌ సొంతం చేసుకోవాలని...

Published on Wed, 01/14/2026 - 01:08

రాజ్‌కోట్‌: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్‌ జట్టు... నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్‌ కోహ్లి సూపర్‌ ఫామ్‌ జట్టుకు కలిసి రానుంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే రిషభ్‌ పంత్‌ గాయపడగా... తొలి మ్యాచ్‌ సందర్భంగా వాషింగ్టన్‌ సుందర్‌కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు.

సుందర్‌ స్థానంలో ఆయుశ్‌ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్‌ పేసర్‌ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్‌లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్‌లో మన స్పిన్‌ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్‌ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్‌ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనుంది. 

ఆ ఇద్దరే అసలు బలం... 
టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్‌ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో విరాట్‌ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్‌లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్‌లతో కదంతొక్కారు.

టీమిండియా ఆడిన గత సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన గిల్‌... హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్‌ బౌలింగ్‌ను బాగా ఆడగల శ్రేయస్‌ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్‌ కనిపించడం లేదు. సుందర్‌ స్థానంలో బదోనీ, నితీశ్‌లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్‌ జురేల్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్‌తో కలిసి అర్‌‡్షదీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా పేస్‌ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.  

సమం చేయాలని... 
గత మ్యాచ్‌లో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్‌ విఫలమైంది. కాన్వే, నికోల్స్‌ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్‌ యంగ్, గ్లెన్‌ ఫిలిప్స్, హే, బ్రేస్‌వెల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్‌ సత్తా చాటుతుండగా... ఫోల్‌్క్స, క్లార్క్‌ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్‌ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్‌ రెడ్డి/ఆయుశ్‌ బదోనీ, జడేజా, హర్షిత్‌ రాణా, కుల్దీప్, అర్‌‡్షదీప్, సిరాజ్‌. న్యూజిలాండ్‌: బ్రేస్‌వెల్‌ (కెప్టెన్‌), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్‌్క్స, ఆదిత్య అశోక్‌.

1. రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్‌ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)