Breaking News

భారత్‌-బంగ్లా రెండో టెస్టు.. ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

Published on Wed, 09/25/2024 - 11:28

భార‌త్‌-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 27 నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. భార‌త్ క్లీన్ స్వీప్‌పై క‌న్నేయ‌గా.. మ‌రోవైపు బంగ్లా ఈ మ్యాచ్‌లో గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్‌లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశ‌న్నట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 27(శుక్ర‌వారం), శ‌నివారం నాడు 90 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెద‌ర్ రిపోర్ట్ చెబుతోంది. ఆదివారం కూడా వ‌ర్షం కుర‌వ‌డానికి  50 శాతం ఆస్కారం ఉంద‌ని ఆక్యూ వెద‌ర్ రిపోర్ట్ తెలుపుతుంది.

ఆఖ‌రి రెండు రోజుల‌కు ఎటువంటి వ‌ర్షం ముప్పులేనిట్లు స‌మాచారం. అయితే భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆప్ర‌మ‌త్త‌మైంది. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ నుంచి అదనపు కవర్లను తెప్పించేందుకు యూపీసీఎ సిద్ద‌మైంది. ముందు జాగ్ర‌త్త‌గా మైదానం మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచాల‌ని యూపీసీఎ అధికారులు భావిస్తున్నారు. 

అయితే కాన్పూర్ గ్రౌండ్‌లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దీంతో చిన్న‌పాటి వ‌ర్షం ప‌డిన కూడా మ్యాచ్‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగే చాన్స్ ఉంది. మ‌రోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిర‌స‌న‌గా  ఈ సిరీస్‌ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ స్టేడియం వ‌ద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకున్నాయి.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)