IND vs AUS: సమం చేసేందుకు సమరం

Published on Sun, 11/02/2025 - 03:36

హోబర్ట్‌: ఆతిథ్య ఆ్రస్టేలియా ఆధిక్యానికి ఆదిలోనే గండికొట్టాలని, ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు వన్డే సిరీస్‌లాగే పొట్టి ఫార్మాట్‌లోనూ వరుస మ్యాచ్‌లు గెలవాలనే లక్ష్యంతో కంగారూ సేన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయం. ప్రధానంగా భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాటింగ్‌ లోపాలపైనే దృష్టిపెట్టింది. 

ఈ పర్యటన ఆరంభం నుంచే టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తన లయను ఇప్పటికీ అందుకోలేకపోతున్నాడు. రద్దయిన తొలి టి20లో 30 పైచిలుకు పరుగులైతే చేశాడు కానీ... ఫలితం తేలిన నాలుగు మ్యాచ్‌ల్లో (మూడు వన్డేలు, రెండో టి20 కలిపి) గిల్‌ ఆట తీవ్రంగా నిరాశపరిచింది. గత పోరుతో పరుగుల జోరును అందుకున్న అభిషేక్‌తో పాటు గిల్, సంజూ సామ్సన్, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, తెలుగుతేజం ఠాకూర్‌ తిలక్‌వర్మ మూకుమ్మడిగా మెరుపులు మెరిపిస్తే ఆసీస్‌ను 20 ఓవర్ల మ్యాచ్‌లో ఓడించడం ఏమంత కష్టమేకాదు. 

వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే సూర్య సేన ఒత్తిడిలోకి కూరుకుపోతుంది. మరోవైపు ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా ఇక సిరీస్‌ను కోల్పోలేని పటిష్టస్థితిలో నిలవాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ మార్ష్, ట్రవిస్‌ హెడ్, ఇన్‌గ్లిస్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌన్సీ పిచ్‌లపై నిప్పులు చెరిగే బార్ట్‌లెట్, ఎలిస్, స్టొయినిస్‌లు టీమిండియా ప్రధాన బ్యాటర్లను ఆదిలోనే పడేయాలని ఆశిస్తున్నారు.  

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)