కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
BGT 2023: ఆఖరి టెస్టు డ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టీమిండియాదే
Published on Mon, 03/13/2023 - 15:55
India vs Australia, 4th Test Drawn: టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 భారత్ సొంతమైంది. స్వదేశంలో రోహిత్ సేన 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సోమవారం ముగిసిన ఆఖరి రోజు ఆట కంటే ముందే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్- శ్రీలంక మధ్య తొలి టెస్టులో కివీస్ గెలవడంతో భారత్‌కు బెర్తు ఖరారైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ- 2023 అహ్మదాబాద్- నాలుగో టెస్టు మార్చి 9- 13
►టాస్- ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్
►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 480
►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 571
►ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్- 175/2 డిక్లేర్డ్
►ఫలితం- డ్రా
►2-1తో సిరీస్ టీమిండియా సొంతం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(364 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 186 పరుగులు)
►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ.
ఆస్ట్రేలియా
ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 హైలైట్స్
1. నాగ్‌పూర్ టెస్టు
ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన రవీంద్ర జడేజా
ఏడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన రవీంద్ర జడేజా
కీలక సమయంలో 70 పరుగులతో జట్టును ఆదుకున్న జడ్డూ
రెండున్నర రోజుల్లో ముగిసిన టెస్టు ఫిబ్రవరి9- 11
స్కోర్లు:
టీమిండియా- 400
ఆస్ట్రేలియా- 177 & 91
2. ఢిల్లీ టెస్టు
ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా
10 వికెట్లతో రాణించి జడ్డూ
స్కోర్లు:
ఆస్ట్రేలియా- 263 & 113
టీమిండియా- 262 & 118/4
3. ఇండోర్ టెస్టు
టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నాథన్ లియోన్(ఆసీస్ ప్రధాన స్పిన్నర్)
11 వికెట్లు పడగొట్టిన లియోన్
స్కోర్లు:
ఇండియా 109 & 163
ఆస్ట్రేలియా- 197 & 78/1
చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశ్విన్‌కూ సాధ్యం కానిది..
Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ
India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺
— BCCI (@BCCI) March 13, 2023
The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT
Tags : 1