Breaking News

ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌దే ఆధిపత్యం

Published on Sun, 06/07/2026 - 10:35

India vs Afghanistan test Day 2 updates and Highlights: ముల్లాన్‌పూర్ వేదిక‌గా భార‌త్‌-అఫ్గానిస్తాన్ మ‌ధ్య రెండో రోజు ఆట ప్రారంభ‌మైంది.

రెండో రోజూ భారత్‌దే
ముల్లాన్‌పూర్ టెస్టులో అఫ్గాన్‌పై భార‌త్ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి అఫ్గానిస్తాన్ 5 వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగులు చేసింది. ప‌ర్యాట‌క జ‌ట్టు భార‌త్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 451 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. క్రీజులో రెహ‌మ‌త్ షా(43) ఉన్నాడు.

కాగా భార‌త అరంగేట్ర ఆట‌గాడు మాన‌వ్ సుతార్ బౌలింగ్‌, బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. బ్యాటింగ్‌లో 28 ప‌రుగులు చేసిన సుతార్‌, బౌలింగ్‌లో 3 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డితో పాటు ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.  తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 564/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(100), శుభ్‌మన్‌ గిల్‌(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్‌ పంత్‌(81), సాయిసుదర్శన్‌(81), వాషింగ్టన్‌ సుందర్‌(52 నాటౌట్‌) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ సలీమ్‌ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్‌, షాహిది తలా వికెట్‌ సాధించారు.

అఫ్గాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
హాస్మతుల్లా షాహిదీ(20) రూపంలో అఫ్గానిస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో వికెట్లు ముందు షాహిదీ దొరికిపోయాడు.

అఫ్గాన్‌ మూడో వికెట్‌ డౌన్‌
గుర్భాజ్‌ రూపంలో అఫ్గానిస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గుర్బాజ్‌.. సుతార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో వికెట్‌ డౌన్‌
అఫ్గానిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అటల్‌.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోర్‌: 49/2

తొలి వికెట్‌ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌
28 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మానవ్‌ సుతార్‌ బౌలింగ్‌లో మొహమ్మద్‌ సిరాజ్‌ క్యాచ్‌ పట్టడంతో అబ్దుల్‌ మాలిక్‌ (16) ఔటయ్యాడు. మానవ్‌ సుతార​్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి వికెట్‌. ఈ వికెట్‌ను అతడు తన తొలి ఓవర్‌లోనే తీయడం విశేషం. మాలిక్‌ ఔటయ్యాక అంపైర్లు టీ బ్రేక్‌కు పిలుపిచ్చారు.

భారత్‌ భారీ స్కోర్‌
అప్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో తమ తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 564/8 వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(100), శుభ్‌మన్‌ గిల్‌(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్‌ పంత్‌(81), సాయిసుదర్శన్‌(81), వాషింగ్టన్‌ సుందర్‌(52 నాటౌట్‌) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ సలీమ్‌ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్‌, షాహిది తలా వికెట్‌ సాధించారు.

సిరాజ్‌ అవుట్‌
టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 12 బంతుల్లో 22 పరుగులు చేసిన సిరాజ్‌.. సలీమ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్‌ స్కోర్‌: 543/8

భారీ స్కోర్‌ దిశగా భారత్‌
రెండో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్‌ సుందర్‌(14), మానవ్‌ సుతార్‌(9) ఉన్నారు. రెండో రోజు ఆటలో భారత్‌.. గిల్‌(100), రిషబ్‌ పంత్‌(81), జురెల్‌(19) వికెట్లు కోల్పోయింది.

పంత్‌ అవుట్‌
రిషబ్‌ పంత్‌(81) రూపంలో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. షాహిది బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ధ్రువ్‌ జురెల్‌ అవుట్‌
19 పరుగులు చేసిన ధ్రువ్‌ జురెల్‌.. సలీమ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు . 102 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌: 456-5

భారత్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
416 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 126 రన్స్‌ చేసిన గిల్‌..సలీమ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌ వచ్చాడు.

రెండో రోజు ఆట ఆరంభం
ముల్లాన్‌పూర్ వేదిక‌గా భార‌త్‌-అఫ్గానిస్తాన్ మ‌ధ్య రెండో రోజు ఆట ప్రారంభ‌మైంది. క్రీజులో రిషబ్‌ పంత్‌(50), శుబ్‌మన్‌​ గిల్‌(106) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. 

మొదటి రోజు ఆటలో కేఎల్‌ రాహుల్‌ శతక్కొట్టగా.. సాయిసుదర్శన్‌(81) హాఫ్‌ సెంచరీతో రాణించారు. అఫ్దాన్‌ బౌలర్లలో సలీమ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. జియావుర్ రెహమాన్‌ ఓ వికెట్‌ సాధించాడు.

తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ

భారత్ : కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)