Breaking News

కాసేప‌ట్లో మ్యాచ్‌.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌

Published on Sat, 06/13/2026 - 12:10

ధర్మశాల వేదికగా తొలి వన్డేలో భారత్‌-అఫ్గానిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత్‌ తమ వన్డే ప్రపంచకప్‌-2027 ప్రిపరేషన్స్‌ను ప్రారంభించనుంది. విరాట్‌ కోహ్లి అందుబాటులో లేకపోయినప్పటికి రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ వంటి స్టార్‌ ప్లేయర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచింది. శనివారం మ్యాచ్‌ జరిగే సమయం (మధ్యాహ్నం 1:30)లో భారీ వర్షం పడేందుకు అస్కారముందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అక్యూవెదర్.కామ్ ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు రోజంతా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య 90 శాతం వర్షం పడే ఛాన్స్‌ ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆ తర్వాత సాయత్రం వర్షం తగ్గుతుందని తెలిపింది. అయితే మళ్లీ రాత్రి వేళ వర్షం పడే అవకాశం 65 శాతం ఉండడంతో మ్యాచ్ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.

కాగా ఈ సిరీస్‌కు స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా దూరమయ్యారు. కోహ్లి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో భర్తీ చేశారు. కానీ హార్దిక్‌ పాండ్యా రిప్లేస్‌మెంట్‌ను బీసీసీఐ ప్రకటించలేదు. అతడి స్ధానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్షిత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్
చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఆ స్టార్‌ ప్లేయర్‌ వచ్చేస్తున్నాడు?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)