Breaking News

గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్‌.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్‌

Published on Sun, 01/21/2024 - 09:45

అండర్‌ 19 వరల్డ్‌కప్‌-2024ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. బ్లూమ్‌ఫోంటెన్‌ వేదికగా మాజీ విజేత బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన గ్రూప్‌ 'ఎ' తొలి లీగ్‌ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ తన సహానాన్ని కోల్పోయాడు. మైదానంలోనే బంగ్లాదేశ్‌ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో మాటల యుద్ధానికి సహారాన్‌ దిగాడు.

అంతలోనే మరో బంగ్లా ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలవడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకరికొకరు దగ్గరకు వచ్చి కొట్టుకునేంత పనిచేశారు. అయితే అంపైర్‌ జోక్యం చేసు​కోవడంతో గొడవ సద్దుమణిగింది.

ఈ సంఘటన భారత ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌లో చోటు చేసుకుంది. అయితే సహారాన్‌ కోపానికి గల కారణమేంటో తెలియలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సహారన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 7.2 ఓవర్లలో కేవలం 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌, కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ అర్ధ సెంచరీలతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ యువ జోడీ మూడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదర్శ్‌ సింగ్‌(76), ఉదయ్‌ సహారన్‌(64) పరుగులు చేశారు.
చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్‌.. ఒకే ఒక్కడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)