Breaking News

శుభ్‌మన్‌ గిల్‌ ఓవరాక్షన్‌.. సచిన్‌, కోహ్లి కూడా ఎప్పుడూ అలా చేయలేదు..!

Published on Thu, 06/12/2025 - 13:52

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియా నయా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. గిల్‌ ఓ ఫోటో షూట్‌లో తనను స్పాన్సర్‌ చేస్తున్న ఎం​ఆర్‌ఎఫ్‌ కంపెనీ బ్యాట్‌తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.

ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్‌ చేస్తూ వస్తుంది. సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎం​ఆర్‌ఎఫ్‌ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను వినియోగిస్తారు.

తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్‌ఎఫ్‌ ఛాంపియన్‌, జీనియస్‌, మాస్టర్‌ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్‌తో పాటు ముద్రిస్తుంది. జీనియస్‌ అన్న పదాన్ని ఎంఆర్‌ఎఫ్‌ చాలాకాలం పాటు వాడింది. సచిన్‌, లారా, డివిలియర్స్‌, విరాట్‌ ఎంఆర్‌ఎఫ్‌ జీనియస్‌ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లు అధికంగా వాడారు.

ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌కు ముందు గిల్‌తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్‌ఎఫ్‌.. అతనికి కూడా జీనియస్‌ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగుంది.

గిల్‌ ఇటీవల టీమిండియా కొత్త కిట్‌ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్‌ఎఫ్‌ లోగో ఉన్న బ్యాట్‌తో ఫోటో షూట్‌కు అటెండ్‌ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్‌ బ్యాట్‌పై ఎంఆర్‌ఎఫ్‌ జీనియస్‌ స్టిక్కర్‌తో పాటు ప్రిన్స్‌ అని ముద్రించడాన్ని గమనించారు.

ఇదే గిల్‌పై విమర్శలకు దారి తీసింది. క్రికెట్‌లో ఎంతో సాధించిన సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి కూడా తమ బ్యాట్లపై తమ బిరుదులైన గాడ్‌, కింగ్‌ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. గిల్‌ ఏవరో కొందరు ప్రిన్స్‌ అనగానే, ఆ పదాన్ని తన బ్యాట్‌పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. 

వాస్తవానికి ప్రిన్స్‌ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90 దశకంలోని అభిమానలు గుర్తు చేస్తున్నారు.  గిల్‌ ప్రిన్స్‌ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్నారు. గిల్‌ ఏం సాధించాడని అతనికి ప్రిన్స్‌ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. 

గిల్‌కు టెస్ట్‌ల్లో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తుకు చేస్తున్నారు. SENA దేశాల్లో అతనికి చెత్త రికార్డు ఉందని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు, దిగ్గజాలు ఇస్తారు. సోషల్‌మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. 

గిల్‌ తన సొంతంగా బ్యాట్‌పై ప్రిన్స్‌ అన్న పదం ముద్రించుకున్నాడో లేక ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీనే ఆ పదాన్ని ముద్రించిందో తెలియలేదు. కాగా, గిల్‌ ఇంగ్లండ్‌ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్‌ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్‌తో గిల్‌కు ఈ అదృష్టం వరించింది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)