Breaking News

హెడ్‌ కోచ్‌ శ్రీజేశ్‌ ఆధ్వర్యంలో...

Published on Mon, 10/07/2024 - 04:16

బెంగళూరు: భారత సీనియర్‌ హాకీ జట్టు మేటి గోల్‌కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్‌ శ్రీజేశ్‌ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్‌ ఆఫ్‌ జొహోర్‌ కప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. 

ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్‌ అలీను కెపె్టన్‌గా, రోహిత్‌ను వైస్‌ కెపె్టన్‌గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. 

లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 19న జపాన్‌తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్‌ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్‌ (25న) జట్లతో భారత్‌ తలపడుతుంది.  

భారత జట్టు: అమీర్‌ అలీ (కెపె్టన్‌), రోహిత్‌ (వైస్‌ కెపె్టన్‌), బిక్రమ్‌జీత్‌ సింగ్, అలీఖాన్, తాలెమ్‌ ప్రియోబర్తా, శారదనాంద్‌ తివారి, సుఖ్‌వీందర్, అన్‌మోల్‌ ఎక్కా, అంకిత్‌ పాల్, మనీ్మత్‌ సింగ్, రోషన్‌ కుజుర్, ముకేశ్‌ టొప్పో, చందన్‌ యాదవ్, గుర్జోత్‌ సింగ్, సౌరభ్‌ ఆనంద్‌ కుశ్వా, దిల్‌రాజ్‌ సింగ్, అర్‌‡్షదీప్‌ సింగ్, మొహమ్మద్‌ కొనైన్‌ దడ్‌. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)