Breaking News

WTC Points Table: రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా

Published on Sun, 11/03/2024 - 18:14

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం ఇది జరిగింది. భారత్‌ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. భారత్‌ పాయింట్స్‌ పర్సంటేజ్‌ 58.33 కాగా.. ఆస్ట్రేలియాది 62.50గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్‌ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ ఉన్నాయి.

కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 147 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని  కూడా ఛేదించలేక చతి​కిలపడింది. న్యూజిలాండ్ స్పిన్న‌ర్లు త‌మ మాయాజాలంతో స్వల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్నారు. అజాజ్ ప‌టేల్‌, గ్లెన్ ఫిలిప్స్ ధాటికి భార‌త్ కేవ‌లం 121 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అజాజ్ ప‌టేల్ 6 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఫిలిప్స్ 3 వికెట్ల‌తో తీశాడు. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్(64) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైంది. విల్‌ యంగ్‌ (71), డారిల్‌ మిచెల్‌ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు, ఆకాశ్‌దీప్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్‌ (90), రిషబ్‌ పంత్‌ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.

28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్‌ మూడు, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 147 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని  ఛేదించేందుకు బరిలోకి దిగిన భార‌త్  121 ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)