Breaking News

శుభారంభమే లక్ష్యంగా...

Published on Sun, 11/23/2025 - 03:32

ఐపో (మలేసియా): సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఐదు సార్లు చాంపియన్‌ అయిన భారత హాకీ జట్టు మరో సారి టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోర్నీ చరిత్రలో రెండో విజయవంతమైన జట్టుగా ఘనత వహించిన భారత్‌ ఆదివారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఢీకొనేందుకు సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత భారత్‌ ఈ ఇన్విటేషనల్‌ టోర్నీ ఆడుతోంది. 

2019 తర్వాత భారత్‌ ఈ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ సారి మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. భారత్, బెల్జియం, కెనడా, కొరియా, న్యూజిలాండ్‌ సహా ఆతిథ్య మలేసియా అజ్లాన్‌ షా సమరానికి సై అంటున్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్‌–2లో నిలిచిన జట్లు అమీతుమీకి అర్హత సాధిస్తాయి. 

కొరియాతో మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే భారత్‌ 24న పటిష్టమైన బెల్జియంతో తలపడుతుంది. 26న మలేసియాతో, 27న న్యూజిలాండ్‌తో, చివరి లీగ్‌ మ్యాచ్‌ను 29న కెనడాతో తలపడుతుంది. టైటిల్‌ పోరు 30న నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌తో పాటు, ఆసియా క్రీడలు కూడా జరుగనున్న నేపథ్యంతో ఈ టోర్నీలో జరుగుతుంది. ఈ టోర్నీలో పలువురు సీనియర్‌ ఆటగాళ్లు, రెగ్యులర్‌ కెపె్టన్‌హర్మన్‌ప్రీత్‌ సింగ్, మన్‌ప్రీత్‌ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు.   

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)