Breaking News

క్వార్టర్‌ ఫైనల్‌లో భారత్‌

Published on Sun, 07/20/2025 - 04:15

సాలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి పోరులో శ్రీలంకపై గెలుపొందిన భారత జట్టు... శనివారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై విజయం సాధించింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో భారత్‌ 110–83 పాయింట్ల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ మహిళల సింగిల్స్‌లో రుజులా 11–5తో మైసా ఖాన్‌పై గెలుపొందింది. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లాల్‌రమ్‌సంగా–తరిణి జంట 11–6తో యూఏఈ జోడీపై నెగ్గింది. తన్వీ శర్మ, రిషిక కూడా విజయాలు సాధించడంతో భారత జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఇదే గ్రూప్‌లో ఉన్న హాంకాంగ్‌ కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి నాకౌట్‌ దశకు చేరింది. ఇక ఆదివారం జరగనున్న పోరులో హాంకాంగ్‌తో భారత్‌ తలపడనుంది. 

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌ ‘డి’ టాపర్‌గా నిలవనుంది. ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అత్యుత్తమంగా 2011లో కాంస్య పతకం నెగ్గింది. ఆ తర్వాత మరోసారి పతకం సాధించలేకపోయింది. గతేడాది క్వార్టర్‌ ఫైనల్లో మలేసియా చేతిలో ఓడి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మొత్తం 17 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరితే పతకం ఖాయం కానుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)