Breaking News

అభిమానులకు షాక్‌!

Published on Thu, 07/27/2023 - 03:46

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పోరు... అభిమానుల కోణంలో అయితే మరీ భావోద్వేగాల సమరం... అందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఎదురు చూశారు. విమాన టికెట్లతో పాటు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి భారీగా పెరిగిన రేట్‌లతో హోటల్‌ గదులు కూడా బుక్‌ చేసుకున్నారు. ఎన్ని వ్యయప్రయాసలెదురైనా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ చూసేందుకు అక్టోబర్‌ 15 కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు.

అయితే ఇప్పుడు వీరందరి ప్లాన్‌ తలకిందులయ్యే అవకాశమూ కనిపిస్తోంది! అహ్మదాబాద్‌లో అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు మ్యాచ్‌ జరపడం చాలా సమస్యగా మారుతుందని అక్కడి భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ రోజు సెక్యూరిటీ కలి్పంచడం తమ వల్ల సాధ్యం కాదని చేతులెత్తేసిన పోలీసులు, మ్యాచ్‌ను మరో రోజుకు మార్చాలని బీసీసీఐ అధికారులకు సూచించారు.

ప్రకటించిన తేదీకంటే ఒక రోజు ముందు అక్టోబర్‌ 14కు మ్యాచ్‌ మారే అవకాశం ఉంది. అయితే ఒక రోజు మారినా ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సమస్యగా మారడం మాత్రం ఖాయం. అసలు షెడ్యూల్‌ ప్రకటించడమే చాలా ఆలస్యం కాగా... గుజరాత్‌లో నవరాత్రి గురించి బోర్డు కార్యదర్శి జై షాకు తెలియకపోవడం ఆశ్చర్యకరం! దీనిపై నేడు జరిగే బీసీసీఐ సమావేశం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వరల్డ్‌ కప్‌ నిర్వహణకు సంబంధించి నేడు వివిధ సబ్‌ కమిటీలతో నేడు బోర్డు చర్చించనుంది.   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)