Breaking News

'ఆ జట్టుతో భారత్‌ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అంతే సంగతి'

Published on Sat, 10/29/2022 - 09:17

టీ20 ప్రపంచకప్‌-2022లో అదరగొడుతున్న జింబాబ్వే పై భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జింబాబ్వే అద్భుతమైన ఫామ్‌లో ఉందని, ఆ జట్టులో మ్యాచ్‌ విన్నింగ్‌ ఆటగాళ్లు ఉన్నారు అని గవాస్కర్‌ కొనియాడు. అదే విధంగా భారత్ కూడా జింబాబ్వేతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కాగా ఆక్టోబర్‌ 27న పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం తెలిసిందే.

ఈ క్రమంలో గవాస్కర్‌ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. "ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్తాన్‌ దాదాపు నిష్క్రమించినట్లే. వారు తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి. ముఖ్యంగా పాక్‌ జట్టు దక్షిణాఫ్రికాపై గెలవడం అంత సులభం కాదు. దక్షిణాఫ్రికా భీకర ఫామ్‌లో ఉంది.

అదే విధంగా భారత్‌ కూడా దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పాకిస్తాన్‌ను కంగుతినిపించిన జింబాబ్వేను కూడా భారత్‌ తేలికగా తీసుకోకూడదు. జింబాబ్వే జట్టులో మ్యాచ్‌ విన్నింగ్‌ ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్‌పై గెలిచి జింబాబ్వే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది" అని పేర్కొన్నాడు,

టీ20ల్లో ఏమైనా జరగొచ్చు
"పాకిస్తాన్‌ అద్భుతమైన జట్టు ఆనడంలో​ఎటువంటి సందేహం లేదు. కానీ టీ20ల్లో ఏమైనా జరగొచ్చు. పాక్‌ జట్టులో నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. కానీ ఈ మెగా ఈవెంట్‌లో వారు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేక పోతున్నారు" అని గవాస్కర్‌ తెలిపాడు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌30న దక్షిణాఫ్రికాతో తలపడుతోంది.


చదవండి: T20 WC 2022: శ్రీలంకతో మ్యాచ్‌.. కివీస్‌కు గుడ్‌ న్యూస్‌! అతడు వచ్చేస్తున్నాడు

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)