Breaking News

లంకపై భారత్‌ మాస్టర్స్‌ గెలుపు

Published on Sun, 02/23/2025 - 03:52

నవీముంబై: అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌ (ఐఎంఎల్‌)లో ఉత్కంఠ రేపిన పోరులో భారత్‌ మాస్టర్స్‌ జట్టు 4 పరుగుల తేడాతో శ్రీలంక మాస్టర్స్‌పై గెలుపొందింది. 223 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన శ్రీలంక గెలిచేందుకు ఆఖరి బంతి దాకా పెద్ద పోరాటమే చేసింది. చివరి 6 బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉండగా అభిమన్యు మిథున్‌ చక్కని బౌలింగ్‌తో లంక బ్యాటర్లను కట్టడి చేశాడు. 

ఆఖరి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ లీగ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలో భారత్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మాస్టర్స్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు సచిన్‌ (10), అంబటి రాయుడు (5) ఇద్దరు నిరాశపరచగా, స్టువర్ట్‌ బిన్నీ (68), యూసుఫ్‌ పఠాన్‌ (56 నాటౌట్‌), గుర్‌కీరత్‌ సింగ్‌ (44), యువరాజ్‌ (31 నాటౌట్‌) లంక బౌలర్లపై దంచేయడంతో 200 పైచిలుకు స్కోరు సాధించింది. 

లంక బౌర్లలో సురంగ లక్మాల్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం శ్రీలంక మాస్టర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులకు పరిమితమైంది. కుమార సంగక్కర (51), జీవన్‌ మెండిస్‌ (42) రాణించారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్‌ పఠాన్‌ 3 వికెట్లు పడగొట్టగా, ధవళ్‌ కులకర్ణి 2 వికెట్లు తీశాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)