Breaking News

రోహిత్‌, అర్షదీప్‌ పోరాటం వృధా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి

Published on Thu, 10/16/2025 - 18:17

మలేసియాలో జరుగుతున్న సుల్తాన్‌ ఆఫ్‌ జోహర్‌ కప్‌లో (Sultan of Johor Cup 2025) భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు (Indian Junior Men's Hockey Team) తొలి పరాజయం ఎదురైంది. నిన్న (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌ 2-4 తేడాతో ఓటమి పాలైంది.

భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (22వ నిమిషం), అర్ష్‌దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39, 42), ఆండ్రూ ప్యాట్రిక్ (40) మరియు కెప్టెన్ డిలన్ డౌనీ (51) గోల్స్ చేశారు.

ఈ మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో భారత్‌ అద్భుతంగా ఆడింది. ఆదిలోనే గోల్‌ కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌ చాకచక్యంగా వ్యవహరించి గోల్‌ను సేవ్‌ చేశాడు. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్‌ ఎక్కా గోల్‌గా మలచలేకపోయాడు. 22వ నిమిషంలో కెప్టెన్‌ రోహిత్‌ మ్యాచ్‌ తొలి గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యం​ అందించాడు.

25వ నిమిషంలో అమీర్‌ అలీ సోలో రన్‌తో గోల్‌కి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా గోల్‌కీపర్‌ అద్భతంగా అడ్డుకున్నాడు.

ఆతర్వాత కొద్ది నిమిషాలకే మ్యాచ్‌ భారత్‌వైపు నుంచి ఆస్ట్రేలియావైపు మళ్లింది. 39 నుంచి 42 నిమిషాల్లోపు ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్‌ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆఖరి నిమిషంలో (60) అర్షదీప్‌ సింగ్‌ అద్భుతమైన డిఫ్లెక్షన్‌తో గోల్‌ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ ఆతిథ్య మలేసియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫలితంపై భారత సెమీస్‌ బెర్త్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్‌ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమితో 7 పాయింట్లు కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 

ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ డ్రాతో 10 పాయింట్లు కలిగి ఉండి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుంది. 

చదవండి: సూపర్‌ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్‌

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)