Breaking News

వచ్చే ఏడాది భారత్‌లో వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

Published on Tue, 09/02/2025 - 05:32

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు 17 ఏళ్ల తర్వాత భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. మన దేశంలో చివరిసారిగా 2009లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. పారిస్‌లో జరిగిన 2025 టోర్నీ ముగింపు సందర్భంగా వచ్చే ఏడాది వేదిక వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. 

ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్‌ అధ్యక్షురాలు ఖున్‌యింగ్‌ పటామా, భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కార్యదర్శి సంజయ్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా వంద శాతం అత్యుత్తమ స్థాయిలో ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహిస్తామని మిశ్రా వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్న జట్లలో భారత్‌ కూడా ఒకటి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఇప్పటి వరకు 15 పతకాలు గెలుచుకుంది. 1983లో ప్రకాశ్‌ పడుకోన్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్యంతో తొలి పతకం అందించగా... 2011 నుంచి ప్రతీ ఏటా కచ్చితంగా మన ఆటగాళ్లు ఏదైనా ఒక పతకం గెలుస్తూ వచ్చారు. అత్యధికంగా పీవీ సింధు ఒక స్వర్ణం సహా మొత్తం ఐదు పతకాలు సాధించింది. 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)