గంభీర్‌ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్‌ చరిత్రలోనే

Published on Fri, 11/14/2025 - 14:14

కోల్‌క‌తా వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు ఎడ‌మ చేతి వాటం ప్లేయ‌ర్లతో బ‌రిలోకి దిగింది. భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే మ్యాచ్‌లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ ఆట‌గాళ్లు ఆడ‌డం ఇదే తొలిసారి.

య‌శ‌స్వి జైశ్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్ పటేల్‌, రవీంద్ర జడేజా, పంత్‌,  కుల్దీప్ యాదవ్ వంటి ఆరుగురు ఎడ‌మ చేతి వాటం ప్లేయ‌ర్లు ఉన్నారు. టాప్‌-8లో అయితే ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్లు ఏకంగా ఐదుగురు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అంతకముందు మూడు సందర్భాల్లో భారత్‌ ఐదుగురు లెఫ్ట్‌ హ్యాండర్లతో ఆడింది. కానీ ఆరు మంది ఆడడం ఇదే మొదటి సారి. అయితే హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆరుగురు అవసరమంటా అంటూ మండిపడుతున్నారు. అందులో నలుగురు స్పిన్నర్లే ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లతో మాత్రమే భారత్‌ ఆడుతోంది.

భారత్ అత్యధిక లెఫ్ట్ హ్యాండర్లతో ఆడిన టెస్టులు ఇవే..
6 vs సౌతాఫ్రికా-కోల్‌కతా 2025
5 vs ఇంగ్లండ్ - మాంచెస్టర్, 2025
5 vs వెస్టిండీస్‌- అహ్మదాబాద్‌, 2025
5 vs వెస్టిండీస్‌- ఢిల్లీ, 2025

సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)