ప్రొ హాకీ లీగ్‌.. మూడో స్థానంతో బారత్‌ ముగింపు

Published on Mon, 06/20/2022 - 07:33

రోటర్‌డామ్‌: ప్రొ హాకీ లీగ్‌ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నెదర్లాండ్స్‌ చాంపియన్‌గా నిలిచింది. భారత్‌ తరఫున అభిషేక్‌ తొలి నిమిషంలోనే గోల్‌ చేయగా... ఏడో నిమిషంలో నెదర్లాండ్స్‌ జట్టుకు జాన్సెన్‌ గోల్‌ అందించి స్కోరును సమం చేశాడు. 45వ నిమిషంలో జోరిట్‌ క్రూన్‌ గోల్‌తో నెదర్లాండ్స్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది.

తొమ్మిది జట్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 30 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలోపు గెలిచిన భారత్, రెండింటిలో ‘షూటౌట్‌’ ద్వారా విజయం అందుకుంది. ‘షూటౌట్‌’లో రెండు మ్యాచ్‌ల్లో, నిర్ణీత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓటమి పాలైంది. మరోవైపు మహిళల ప్రొ హాకీ లీగ్‌లో అర్జెంటీనాతో మ్యాచ్‌ లో భారత్‌ 2–3తో ఓడిపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా టైటిల్‌ను ఖరారు చేసుకుంది.
చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్‌ స్టార్‌కు వింత అనుభవం

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)