Breaking News

ఫుట్‌బాల్‌లోనూ పాక్‌పై  భారత్‌దే పైచేయి 

Published on Tue, 09/23/2025 - 05:06

కొలంబో: ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో పాకిస్తాన్‌ జట్టును భారత జట్టు చితక్కొట్టగా... మరోవైపు ఫుట్‌బాల్‌లోనూ పాకిస్తాన్‌ జట్టుపై భారత్‌ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–17 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో సోమవార జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున దలాల్‌మువాన్‌ గాంగ్టే (31వ నిమిషంలో), గున్లేబా వాంగ్‌ఖెరాక్‌పమ్‌ (64వ నిమిషంలో), రహాన్‌ అహ్మద్‌ (74వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

పాకిస్తాన్‌ జట్టుకు హంజా యాసిర్‌ (71వ నిమిషంలో), మొహమ్మద్‌ అబ్దుల్లా (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆరు పాయింట్లతో పాకిస్తాన్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్‌ ‘బి’ నుంచి భారత్, పాకిస్తాన్‌ జట్లు సెమీఫైనల్‌ చేరుకున్నాయి. గ్రూప్‌ ‘ఎ’ నుంచి బంగ్లాదేశ్, నేపాల్‌ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈనెల 25న జరిగే సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్‌; నేపాల్‌తో భారత్‌ తలపడతాయి.   
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)